సొంతగూటికి చేరిన ఎంపీటీసీ విజయ రెడ్డి 

సొంతగూటికి చేరిన ఎంపీటీసీ విజయ రెడ్డి

తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: కాటారం మండలంలోని చింతగాని గ్రామ ఎంపీటీసీ ఉడుముల విజయ రెడ్డి బీజేపీ పార్టీ కి రాజీనామా చేసి శనివారం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మాజీ మంత్రి వర్యులు ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేము నూరి ప్రభాకర్ రెడ్డి, చింతకాని సర్పంచి బాబా, మాజీ ఎంపిటిసి కోసరి భాస్కర్, డిసిసి ఉపాధ్యక్షులు చీమల వెంకటస్వామి, గద్దే సమ్మిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎంపీటీసీ జాడి మహేశ్వరి, ప్రచార కమిటీ కన్వీనర్ కో కన్వీనర్లు కుంభం రమేష్ రెడ్డి, నాయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment