వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి దుక్కిటెద్దు మృతి. 

వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి దుక్కిటెద్దు మృతి. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం అడవి ప్రాంతంలో దుప్పులకు అమర్చిన ఉచ్చులో పడి దుక్కిటేద్దు మృతి చెందిన సంఘటన ధర్మారం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు  రాంపురం గ్రామానికి చెందిన రైతు తోట భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం మేతకు వెళ్లిన రెండు ఎద్దులు రాక పోవడంతో, ఆదివారం ఉదయాన్నే వెతకడానికి వెల్లగా ధర్మవరం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చి న ఉచ్చులో రెండు దుక్కిటేద్దులు చిక్కుకొన్నా యి. గమనించిన తోట భాస్కర్ ఉచ్చులో చిక్కుకున్న ఎద్దులను ఉచ్చులను తొలగించగా అప్పటికే ఒక ఎద్దు మృతి చెందింది. మరోక్కటి ప్రాణాపాయంతో బయట పడింది. ఎద్దు విలువ 50 వేలకు పైగా ఉంటుందని, దుక్కి టెద్దు మృతి చెందడంతో, పేదరికంలో ఉన్న రైతు లబోదిబోమంటున్నారు. రెక్కడితెనే డొక్కాడని పేద రైతు కుటుంభం దిక్కు తోచని స్థితిలో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలా జరగడంపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, వేటగాళ్లను దొరకబట్టి తగిన బుద్ధి చెప్పాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తనకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని భాధిత రైతు కుటుంభం పత్రికా ముఖంగా ములుగు జిల్లా కలెక్టర్ కు ముక్తకంఠంతో ఆ పేద కుటుంబం విజ్ఞప్తి చేస్తున్నది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి దుక్కిటెద్దు మృతి. ”

Leave a comment