వెంకటాపూర్ జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలి

వెంకటాపూర్ జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలి

– జర్నలిస్టులను విస్మరిస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం

– సీనియర్ పాత్రికేయులు సతీష్, మురళీ

వెంకటాపూర్, నవంబర్ 27, తెలంగాణ జ్యోతి: మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రభుత్వ భూమిలో వెంకటాపూర్ జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలని సీనియర్ పాత్రికేయులు బేతి సతీష్, ఒద్దుల మురళీ అధికారులను కోరారు. శాంతియుత దీక్ష లో భాగంగా సోమవారం పాలంపేట జర్నలిస్టుల కాలనీ వద్ద వారు మాట్లాడారు..కేసీఆర్ జర్నలిస్టుల కు ఇచ్చిన హామీలను విస్మరించారని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి జర్నలి స్టులు వారధిలాంటి వారని అన్నారు. అలాంటి జర్నలిస్టుల ను పట్టిచుకోక పోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం మరియు అధికారులు పట్టించుకోకపోవడం మూలంగానే పాలం పేట లోని ప్రభుత్వ భూమిలో తాము గుడిసెలు వేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల అనంతరం ఏ ప్రభుత్వం వచ్చిన తమకు వెంటనే ఇండ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రాజు, రమేష్, భిక్షపతి, యుగేందర్, ధర్మ, రఫీ, కృష్ణ, సంపత్, ప్రశాంత్, చంద్రమౌళి,సారంగం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment