వెంకటాపురం, వాజేడు మండలాల్లో నూతన బ్రాంది షాపులు ప్రారంభం. 

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం, వాజేడు మండలాల్లో నూతన బ్రాంది షాపులు ప్రారంభం. 

– గ్రామాల్లో తెరుచుకోనున్న గొలుసు కట్టు దికాణాలు. 

వెంకటాపురం, నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో నూతన ఎక్సైజ్ విధానంలో మంజూరైన బ్రాందీ షాపులు ను డిసెంబర్ 1 శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. గిరిజన సంక్షేమ చట్టాలు అమలులో ఉన్న 1/70 చట్టం , ఏజెన్సీ ప్రాంతంలో మద్యం మాఫియా గిరిజనుల పేర్లతో బినామీ మద్యం షాపులను దక్కించుకొని, కోట్లాది రూపాయల గిరిజన దోపీడి వ్యాపారాన్ని ఏజెన్సీ ప్రాంతాలు లో నిర్వహిస్తున్నారు. పిసా గ్రామసభల నిర్వహణ నాటినుండి బ్రాంది షాపులు కావాల,లేక వద్దా అనే అంశం పై షాపులు కొరకు నిర్వహించే గ్రామ సభలు నాటి నుంఢే ప్రారంభమైన కరెన్సీ నోట్ల దందా గిరి తో మద్యం మాఫియా, ఆదివాసీలను అడ్డుపెట్టుకొని మద్యం షాపులను దక్కీంచు కోన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో రెండు మండలాల్లో వందలకొద్దీ గొలుసుకట్టు బెల్ట్ షాపులు, వ్యాపారం దొడ్డి దారిన దొంగతనంగా మద్యం వ్యపారం కొనసాగింది. అయితే ఎన్నికల సమయంలో అధికారులను ప్రసన్నం చేసుకొని, కోట్లాది రూపాయల నకిలి మద్యాన్ని అక్రమ పద్ధతిలో విక్రయించుకొని ,మద్యం మాఫియా కోట్ల రూపాయలు కూడ గట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లి వెత్తాఇ. మద్యం మాఫియా గతంలో వ్యాపారంతో సంబంధాలు ఉన్న వారిని భాగస్వామ్యం చేసి, వెంకటాపురం పట్టణంలోని పలువురు ప్రముఖ కోట్లు టర్నోవర్ వ్యాపారులను సిండు కేట్లుగా,భాగస్వామ్యం చేసి ,వ్యాపార భాగస్వామ్యంతో, నూతన షాపులు ఏర్పాటు చేసుకునేందుకు, డిసెంబర్ ఒకటో తేదీ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారని మద్యం వ్యసనంతో జేబులు గుల్ల చేసుకున్నా, మద్యం ప్రియులు చెవులు కోరుక్కుంటున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయా నూతన షాపులలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, సిండికేట్ వ్యాపారులు మద్యం షాపులను ప్రారంభించినట్లు పలువురు మధ్య ప్రియులు చర్చించుకుంటున్నారు. వెంకటాపురం మండలంలో వి ఆర్ కె పురం, నాయకులగూడెం ,అలాగే వాజేడు మండలంలో రెండు మొత్తం నాలుగు షాపులు శుక్రవారం తెరుసుకుంటున్నట్లు సమాచారం. మద్యం సిండికేట్ మాఫియా ఏజెన్సీలో మద్యం వ్యాపారం పై దృష్టి సారించి గ్రామ, గ్రామాన,వీది వీదిన గొలుసుకట్టు దుకాణాలతో గ్రామీణ యువత, గ్రామస్తులను మద్యం మత్తులో తూగే విధంగా వ్యాపారం మూడు పుల్ బాటిల్స్ , ఆరు గ్లాసులు గా ఉండే విధంగా ప్రత్యేక పూజాదీ కార్యక్రమాలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి మద్యం షాపులను ప్రారంభించినట్లు చర్చించు కుంటున్నారు. ప్రారంభం రోజున షాపులు వున్న గ్రామాల్లోని యువతకు, పెద్దలకు ఉచితంగా మద్యాన్ని సరఫరా చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now