వెంకటాపురం వాజేడు మండలాల బిఆర్ఎస్ ఎన్నికల కన్వీనర్ గా బుచ్చయ్య. 

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం వాజేడు మండలాల బిఆర్ఎస్ ఎన్నికల కన్వీనర్ గా బుచ్చయ్య. 

  • కోకన్వినర్ గా జి. నరసింహమూర్తి నియామకం.

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు,వెంకటాపురం మండల ముఖ్య కార్యకర్తల  సమావేశం లో ఎన్నికల మండలాల ఇన్చార్జిలను నియమించారు. ఎమ్మెల్సీ భద్రాచలం ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు, వాజేడు వెంకటాపురం మండలాల నేలు పాల్గొన్నారు. ఎన్నికల కన్వీనర్ గా మాజీ మార్కెట్ కమిటీచైర్మన్ బోదేబోయిన బుచ్చయ్య, మరియు కో-కన్వీనర్ గా గూడవర్త నరసింహా మూర్తి లను నియమించిన ట్లు ఎమ్మెల్సీ, ఎన్నికల ఇంఛార్జి తాతా మధుసూదన్ కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం బూత్ కన్వీనర్ లకు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై దిశా నిర్దేశం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుతోనే భద్రాచలం నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి చెందుతుందని, భద్రాచలం ప్రజలు తమ బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మరియు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now