వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్.

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్.

– వెంకటాపురం మండలంలో 83% శాతం ,వాజేడు లో. 88 శాతం పోలింగ్.  

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వెంకటాపురం మండలంలోని 32 పోలింగ్ బూత్ లలో 83% పైగా పోలింగ్ నమోదు అఇంది. వాజేడు మండ లంలో 88 శాతం పోలింగ్ నమోదు అఇనట్టు అదికారులు ప్రకటిం చారు. సమస్యా త్మక, మరియు అత్యంత సమస్యాత్మక మైన పోలింగ్ కేంద్రాలుగా రికార్డుల లో నమోదు అయిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు విస్తృత బంధో బస్తు నిర్వహించారు. సివిల్ మరియు సిఆర్పిఎఫ్ అదనపుబలగాలతో పహారకాస్తు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలు బహిష్కరించ మని గతంలో మావోలు ప్రకటన జారీ చేయడంతో ఎన్నికల తేదీకి రెండు మూడు వారాలు ముందే, అదనపు పోలీసుబలగాలతో అటవీ గ్రామాలతో పాటు, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక బందో బస్తు పెట్రోలింగ్ తో మావోయిస్టుల కవ్వింపు చర్యలను పోలీస్ శాఖ పకడ్బందీ వ్యూహంతో, ప్రతిష్టమైన భద్రతతో తిప్పికొట్టారు. ఎన్నికల బహిష్కరణ ప్రకటనను ప్రజలు త్రోసి పుచ్చి వెంకటాపురం మండలంలో 83.42 శాతం పైగా పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే వాజేడు మండలం లో 88శాతం పోలింగ్ నమోదు అఇనట్లు ఎన్నికల అదికారులు మీడి యాకు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుఆదేశంపై వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ పర్యవేక్షణలో, వాజేడు, వెంకటాపురం, పేరూరు మరియు ఆలుబాక సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు పోలీస్ అదికారులు సి.ఐ. కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బలగాలు రాత్రి, పగలు తేడా లేకుండా విధులు నిర్వహిం చి, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినందుకు, రెండు మండలాల ప్రజలు, ఓటర్లు పోలీసు ఉన్నతాధికారులు, సివిల్ అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ,పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం విధులు నిర్వ హించిన అదికారులు కు ,సిబ్బందిని అబినందిస్తున్నారు. గురు వారం వేకువజామునే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్షన్ డ్యూటీ అధికారులు, సిబ్బంది ఈవీఎం లతో చేరుకొని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అలాగే ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గురువారం పోలింగ్ సందర్భంగా వ్యవసాయ పనులకు బ్రేక్ పడింది. వెంకటాపురం, వాజేడు మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ప్రత్యేక భద్రతాపరమైన పోలీస్ బందోబస్తు తో, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని పోలింగ్ పర్సెంటేజీలను, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎన్నికల సెక్టోరియల్ అధికారైన అడ్డూరి బాబు మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి, వార్తా సేకరణలో నిమగ్నమైన మీడియా మిత్రులకు సమాచారం అందజేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now