వెంకటాపురం ఫారెస్ట్ లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు శిక్షణ.

Written by telangana jyothi

Published on:

వెంకటాపురం ఫారెస్ట్ లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు శిక్షణ.

  •  సిద్ధిపేట కాలేజీ నుండి ప్రాక్టికల్స్ కు వచ్చిన ఐదుగురు విద్యార్థినులు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీశాఖ చేపట్టిన అడవుల సంరక్షణ మొక్కల పెంపకం ఇతర అంశాలపై రీసెర్చ్ చేసేందుకు సిద్దిపేట యూనివర్శిటి కాలేజీ నుండి ఐదుగురు విద్యార్థుల బృందం వెంకటాపురం చేరుకుంది.వెంకటాపురం రేంజ్ లో ఫారెస్ట్ శాఖ అధికారుల గైడెన్స్ తో, ఫారెస్టు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేట యూనివర్సిటీ నుండి బి.ఎస్సి (ఫారెస్ట్రి) నాలుగో సంవత్సరం విద్యార్థులైన శ్రావణి, శ్రీజ, శేత కరాడ్, స్వప్న శాలమ్ , శృతి లయ తదితర బీ.ఎస్సీ ఫారెస్ట్ నాలుగో సంవత్సరం విద్యార్థినిలు పదిరోజుల పాటు అడవుల్లో ప్రాక్టికల్ రీసెర్చ్ చేసేందుకు, యూనివర్సిటీ అధికారులు ఆదేశాల మేరకు, ములుగు జిల్లా ఫారెస్ట్ అధికారి ఆదేశంపై, వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్లో రీసెర్చ్ చేస్తున్నారు. మొత్తం నాలుగు సంవత్సరాల డిగ్రీ ఫైనల్ ఇయర్లో, ప్రాక్టి కల్ రీసెర్చ్ అతి ముఖ్యమైనదని విద్యార్థినులు తెలిపారు. ఈ మేరకు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో,ఆయన ఆదేశం పై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దేవా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు భవాని, ఇంకా పలువురు మహిళా బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్రీ శిక్షణ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం అడవుల్లో చేపడుతున్న,చేపట్టిన ప్లాంటేషన్, మొక్కల పెంపకం, సెంట్రల్ నర్సరీ, మట్టి కోత గురు కాకుండా ఉండే చర్యలు,అడవుల సంరక్షణ, అడవుల పెంపకం, వాటి రక్షణ చర్యలు ,కందకాలు , ఇంకుడు గుంతలు, మరియు వన్య ప్రాణులకు వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణ కోసం తవ్విన కుంటలు, వాటర్ , ఇంకా అనేక అంశాలపై అటవీ శాఖ అధికారులు శిక్షణ విద్యర్దీనులకు ప్రాక్టికల్ గా ద అవగాహన కల్పించారు. అలాగే 1933 వ సంవత్సరం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నాటిన వెంకటాపురం శివారు లోని టేక్ ప్లాంటేషన్ సైతం ప్రాక్టికల్స్ విద్యార్థులకు వివరించారు. వాటి ప్రాముఖ్యత, వాటి పెరుగుదల తదితర అంశాలపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దేవా, బీట్ ఆఫీసర్ భవాని, ఇతర మహిళ బీట్ ఆఫిసర్లు విద్యార్థులు తో వెంట ఉండి అవగాహన కల్పించారు. విద్యార్థులందరికీ అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశంపై వెంకటాపురం మండల కేంద్రంలోని, ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో బస ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ ప్రాక్టికల్స్ ఎంతో ముఖ్యమైన వని, తదుపరి బి.ఎస్.సి. ఉత్తీర్ణత అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఎం ఎస్ సి ఫారెస్ట్రీ ఉన్నత విద్య కూడా చదువుకుంటామని తెలిపారు. పి.జి. తదుపరి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని విద్యార్థినిల బృందం తెలిపింది. వెంకటాపురం ఫారెస్ట్ అధికారులు,సిబ్బంది తమ విద్యార్థిల బృందానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి విద్యార్థినుల బృందం కృతజ్ఞతలు తెలియజేసింది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now