వి ఆర్ కె పురం లో వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం.

Written by telangana jyothi

Published on:

వి ఆర్ కె పురం లో వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా భద్రాచలం నియోజకవర్గం లోని వెంకటాపురం మండలం      వి ఆర్ కే పురం గ్రామంలో గురువారం పెద్ద ఎత్తున వాడ బలిజ సేవా సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్ హాజరై సభలోమాట్లాడుతూ, వాడ బలిజ కులస్తులు అందరూ కలిసికట్టుగా ఆయనకు మొమరండం అందజేశారు. 5 డిమాండ్ల పై సమ్మెళంనంలో చర్చించారు. ఐదు డిమాండ్లను కూడా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ముఖ్య మంత్రి తో మాట్లాడి పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యం గా ములుగు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా వాడ బలిజ కులస్తులు ఉన్నప్పటికీ ఇంకా వెనుకబడి ఉన్నారని వాడ బలిజ కులస్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులుగా గుర్తించినప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతం అవడం వలన వాడ బలిజ కులస్తులుకు ప్రభుత్వం ఇస్తున్నటు వంటి మత్స్యకార పథకాలు సబ్సిడీలో అందిస్తున్నటువంటి మోటార్, సైకిల్, బొలెరోలు అంద టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైన ప్రతి ఒక్క ఓడ బలిజ కులస్తులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు మత్స్య కార సభ్యత్వం కట్టుకోవాలని సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ప్రవేశపెట్టిన అటు వంటి అన్ని పథకాలు వర్తిస్తాయని తెలియజేశారు.ఈ ప్రాంతంలో సమస్యలన్నింటిని కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చింతూరి వెంకట రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య , రాష్ట్ర యువ నాయకులు డర్రా దామోదర్ ,రాష్ట్ర మాజీ అధ్యక్షులు చింతూరు గాంధీ , ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు గార ఆనంద్ , ములుగు మత్యకార సొసైటీ అధ్యక్షులు రఘు, వెంకటాపురం మండల మత్స్యకార మార్కెటింగ్ అధ్యక్షులు మేకల బోయిన సాంబశివ రావు, గార నాగార్జున, వి ఆర్ కె పురం ఉపసర్పంచ్ డర్ర శివరాణి, బానారి సమ్మయ్య, బానారి మల్లయ్య, అంగాల వెంకట స్వామి, బొల్లె రమేష్, అల్లి నాగేశ్వరరావు, తదితరులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now