విస్తృతంగా వాహనాల తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం పేరూరు పోలీసులు మంగళవారం పి.ఎస్.లిమిట్స్ లోని జాతీయ రహదారిపై విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. సతీష్ గ డ్ సరిహద్దులోని బీరమయ్య జాతర టెంపుల్ వద్ద జాతీయ రహదారిపై వచ్చే పోయే వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున, చత్తీస్గఢ్ నుండి అసాంఘిక శక్తులు, మరియు ఎన్నికల కోడ్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం, ఆధారాలు లేని నగదు, ఇతర చట్టవిరుద్ధ రవాణాపై పోలీసులు డేగ నేత్రం తో నిఘాను తీవ్రతరం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, పోలీసులు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశం పై వెంకటాపురం సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ప్రతినిత్యం వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నా రు. ఈ సందర్భంగా వాహనాల్లో ప్రయాణించే అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. పేరూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జి. రమేష్ ఆధ్వర్యంలో వాహనాల త ణిఖిల లో సివిల్ పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.