లక్నవరం రూట్ లో కారు బీభత్సం

లక్నవరం రూట్ లో కారు బీభత్సం

లక్నవరం రూట్ లో కారు బీభత్సం

– బుస్సాపూర్లో అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
– వృద్ధుడి మృతి

– నలుగురిని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన గ్రామస్తులు

– నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ కు తరలించిన అధికారులు

    ములుగు ప్రతినిధి :  విహారయాత్రకు వచ్చిన ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఇంట్లోకి దూసుకెళ్లి వృద్ధుడు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా గోవింద రావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు తమ కారులో ప్రముఖ పర్యాటక కేంద్రమైన లక్నవరం సందర్శనకు వచ్చారు. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామానికి చేరుకోగానే కారు ఒకసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటిముందు కట్టెలు కొడుతున్న కట్ట నర్సిరెడ్డి (55) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న వారిని గ్రామస్తులు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కార్ లో ఉన్న వారిని పస్ర పోలీస్ స్టేషన్కు తరలించారు. అందులో మహిళకు గుండెనొప్పి వస్తుందని తెలుపగా వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. నర్సిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన లక్నవరం వచ్చే టూరిస్టులు జాగ్రత్తలు పాటించాలని పసరా ఎస్సై కమలాకర్ సూచించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “లక్నవరం రూట్ లో కారు బీభత్సం”

Leave a comment