రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే : అజ్మీరా ప్రహ్లాద్

రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే : అజ్మీరా ప్రహ్లాద్

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని ములుగు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి డా.అజ్మీరా ప్రహ్లాద్ అన్నారు. మంగపేట మండలంలో బిజెపి అభ్యర్థి డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారంలో భాగంగా భారీ సంఖ్యలో హాజరైన కార్యకర్తలు,ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అజ్మీర ప్రహ్లాద మాట్లాడుతూ ఏజెన్సీలో బిజెపి గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని, బిజెపితోనే మనుగడ ఉంటుందని ఆలోచిస్తున్నారని అన్నారు.మాజీ మంత్రి చందూలాల్ హయాంలోనే ములుగు జిల్లా అభివృద్ధి జరిగిందని,10 సంవత్సరాలు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా చేసి ఎటువంటి అభివృద్ధి చేయకపోగా మళ్లీ అభివృద్ధి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి రైతుకు బిజెపి ప్రభుత్వంలో పట్టాలు అందుతాయని,ఏజెన్సీలో అందరికీ సమాన హక్కులు అందుతాయని అన్నారు. ముఖ్యంగా 60,70 ఏళ్ల నుండి గిరిజనులతో కలిసి ఏజెన్సీలో జీవిస్తున్న గిరిజనేతరుల సమస్యలను తీర్పుతామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని, బిజెపి ప్రభుత్వంలో ఎటువంటి ఎల్టీఆర్ కేసులు ఉండవని, భూమి సమస్యలు ఉండవని అన్నారు.మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు దేశంలో ప్రవేశపెట్టిందని,రాష్ట్రంలో అనేక పథకాలు కేంద్రం ప్రవేశపెట్టిన వేనని,రాష్ట్రంలో ఇచ్చే ఉచిత రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవే అని,ప్రతి మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించడం జరిగింది అని,నేషనల్ హైవేస్, బ్రిడ్జిల నిర్మాణం ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. చందూలాల్ వారసుడిగా ఈ ప్రాంత స్థితి గతులు తెలిసిన వాడినని, ఇక్కడి ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనని,ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడతానని, ఏజెన్సీ అభివృద్ధి జరగాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment