మృత కుటుంబాన్ని పరామర్శించిన ప్రహ్లాద్.
తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, ములుగు ప్రతినిధి : మండలంలోని పత్తిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో పోరిక బాలునాయక్ కుమారుడు సురేష్ మరణించగా జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను మాజీ మంత్రి చంద్రాల్ కుమారుడు, బిజెపి అభ్యర్థి ప్రహ్లాద్ పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల నుండి ఘటన జరిగిన వివరాలను తెలుసుకొని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆర్థిక సహాయం అందించాలన్నారు.