ములుగులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
తెలంగాణ జ్యోతి, నవంబర్ 19, ములుగు ప్రతినిధి : ములుగు మండలంలోని పతిపల్లి,కాశీందేవిపేట సబ్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఎఈ సాయి కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.ములుగు సబ్ స్టేషన్ పరిధిలో ములుగు 2వ ఫీడర్,11 కేవి వెంకటాపూర్ ఫీడర్ వర్క్ కోసం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1 గంటల వరకు అంతరాయం ఉంటుందని తెలిపారు.కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలోని గొల్లవాడ,జిపి రోడ్, శివాలయం రోడ్,పాల్సాబ్ పల్లి రోడ్,డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ ఏరియా,లీలా గార్డెన్ ఏరియా,బస్టాండ్ రోడ్,గడి గడ్డ,పాల్సాబ్ పల్లి గ్రామంలో రంగారావుపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.