మా బతుకులు ఆగమయ్యాయి : ఆలుబాకలో ఆటో కార్మికుల ధర్నా.   

మా బతుకులు ఆగమయ్యాయి : ఆలుబాకలో ఆటో కార్మికుల ధర్నా.   

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యొతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక గ్రామంలో శుక్రవారం వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి లో ఆటో యూనియ న్ కార్మికులు ఆటోలతో  ధర్నా , రాస్తారోకో నిర్వహించారు. మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సుల పథకం అమలు తో మా ఆటోలు ఎవరు ఎక్కటం లేదు. ఉదయం నుంచి సాయం త్రం వరకు కూడా ఆటోలను ఖాళీగా తిప్పడం జరుగుతుంది. కనీసం డీజిల్ ఖర్చు లు వరకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలకు ఇ.ఎం.ఐ. కట్టడం కూడా కష్టంగా ఉంటుందని నినాదాలు చేశారు. ఆటోవాలాల బతుకులు రోడ్డున పడ్డాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు గంగిని బోయిన కృష్ణ మాట్లాడుతూ ఆటో కుటుంభాలను ఆదుకోవాలని, ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమ లు చేసీ ఆటో వాళ్లకి 12,000 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కారణం గా భారీ ఎత్తున బస్సులు, లారీలు, కార్లు వాహనాలు నిలిచిపోయాఇ. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆటో కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “మా బతుకులు ఆగమయ్యాయి : ఆలుబాకలో ఆటో కార్మికుల ధర్నా.   ”

Leave a comment