మావోయిస్టు ప్రభావిత ఆదివాసి, అటవీ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అటవీ గ్రామాల్లో భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు గురువారం పర్యటించారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన తిప్పాపురం, ముత్తారం, కలిపాక, సీతారాంపురం, పెంకవాగు, కొత్త గుంపు, గ్రామాల్లో పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. జరుగుతున్నటు వంటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ తెల్లం వెంకటరావు కి ఓటు వేసి గెలిపించాలనీ కోరారు. వెంకటాపురం మండలం లోని దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి తిప్పాపురం పంచాయతీని, దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు వారికీ హామీ ఇచ్చారు. గ్రామంలోకి ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన అభ్యర్థి డాక్టర్ వెంకటరావు కు , గులాబీ నేతలకు ఆయా గ్రామాల ఆదివాసీలు ఘన స్వాగతం పలికి, తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు తమ కుటుంబాలకు అందుతు న్నాయని, కారు గుర్తుకే ఓటు వేసి డాక్టర్ ను గెలిపించుకుంటామని హర్షద్వానాల మధ్య ఆదివాసీలు ప్రకటించారు. అటవీ గ్రామాల్లో గులాబీ నేతలు కాలి నడకన,ద్విచక్ర వాహనాలపై పర్యటించి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నూగూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మరియు వాజేడు, వెంకటాపురం మండలాల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ బోధ బోయిన బుచ్చయ్య, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కో కన్వీనర్ గూడవర్తి నర సింహమూర్తి , బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు, ముస్తఫా , సర్పంచులు పూజారి ఆదిలక్ష్మి, సోడి రాదా, బాడిచె సత్యం, ఉపసర్పంచులు బాణారి సమ్మక్క, చందర్రావు, లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి మురళి, ముడుంబా శ్రీను, ముస్తఫా, సుంకర సంటి, వినోద్, సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు అటవీ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు .
1 thought on “మావోయిస్టు ప్రభావిత ఆదివాసి, అటవీ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం. ”