మారుమూల అటవీ గ్రామాల్లో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. 

Written by telangana jyothi

Published on:

మారుమూల అటవీ గ్రామాల్లో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం.

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు కారు గుర్తుకు ఓటు వేయాలని ములుగు జిల్లా వెంకటాపురం మండలం, ఆలుబాక పంచాయతీ తిప్పాపురం పంచాయతీలలో బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తిప్పాపురం కలిపాక అటవీ గ్రామాల్లో సోమవారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు పర్యవేక్షణలో సీని యర్ నాయకులు ముస్తఫా పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రచార కరపత్రాలను ఇంటింటికి పంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసే సంక్షేమ పథకాలపై వివరిస్తూ డాక్టర్ గారి కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆదివాసీలకు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ పనులు కారణంగా ఉదయం, సాయం త్రం వేళల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ఆలుబాక, తిప్పాపురం బోదాపురం ఇతర ప్రాంతాల్లో విస్తృత ప్రచార కార్యక్ర మాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరచిన సంక్షేమ పథకాలతో గ్రామస్తులు జై కేసీఆర్ జై జై కేసీఆర్ అంటూ కారు గుర్తుకే ఓటేస్తాం డాక్టర్ ని గెలిపించుకుంటాం అంటూ ప్రచార బృందాలకు స్వాగతం పలుకుతూ, జై టిఆర్ఎస్ జై జై టిఆర్ఎస్ అంటూ అటవీ గ్రామాల్లో కారు గుర్తు దూసుకుపోతు న్నది. ఆయా గ్రామాల ప్రజలతో నిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మండల పార్టీ బిఆర్ఎస్ అధ్యక్షుడు గంపా రాంబాబు సీనియర్ నేత ముస్తాఫా, పార్టీ నేతలు తమ గ్రామాలకు వచ్చి కారు గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేస్తుండటంతో గ్రామస్తులు యావత్తు కారు గుర్తుకే ఓటు వేస్తామని స్వాగతం పలుకుతు న్నారు. మండలంలోని తిప్పాపురం పంచాయతీ పరిధిలో కలిపాక గ్రామంలో పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. పార్టీ మండల ప్రెసిడెంట్ గంప రాంబాబు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ నాయకుడు ఎస్ కె ముస్తఫా గిరిజన గ్రామాలు లో విస్తృతంగా ప్రచారం నిర్డావహించారు. డాక్టర్ వెంకట్రావు భారీ మెజార్టీ ఓట్లతో గెలిపించాలని కారు గుర్తుతో ప్రచార కార్యక్రమాన్ని అటవీ గ్రామాల్లో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కా ర్యకర్తలు కుమార్ , రాజు., సమ్మయ్య , ప్రసాద్ , కన్నారావు, ఎక్కిల గిరిబాబు తదితర కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now