మాజీ జడ్పీటీసీ పుట్ట మధు ఆరోపణలు అర్థరహితం
కాటారం, జూలై1, తెలంగాణ జ్యోతి : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు దళితుల పట్ల చేసిన తప్పిదాలను కప్పిపుచ్చు కోవడానికి దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారని కాటారం మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అన్నారు. మంథని నియోజకవర్గంలో పుట్ట మధు తన ఉనికిని కోల్పోవడంతో హైదరాబాద్ కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాల్సివచ్చిం దని తెలిపారు. ఈ ప్రాంతం లో జరిగిన హత్యలు రౌడీ రాజకీయం పుట్టమధు ఎమ్మెల్యేగా తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరగాయని తెలియజేశారు, దళితులపై కపట ప్రేమ నటిస్తూ దళితులనే హతమార్చిన ఘనత పుట్ట మధుకే దక్కుతుందని,తను దళితుల పక్షాన ఉన్నానంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని,మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తారని, వారికి ఏ సమస్య వచ్చిన క్షణంలో పరిష్కారానికి కృషి చేస్తారని, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి ఆ పనులు చేస్తున్న వ్యక్తి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మండల స్థాయిలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు పూర్తి అవగాహన లేకుండా తమ నాయకుడు ఏం మాట్లాడిన వత్తాసు పలుకుతూ వ్యక్తిగతంగా మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కడారి విక్రమ్, చీటూరి మహేష్ గౌడ్, పసుల మొగిలి, కోడి రవికుమార్, మంత్రి ప్రభాకర్,యూత్ కాంగ్రెస్, మండల నాయకులు పాల్గొన్నారు.