మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు
– జోరుగా హోలీ ఉత్సవాలలో పాల్గొన్న యువకులు, పెద్దలు చిన్నారులు
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా యువకులు రంగులతో సంబరాలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు రంగులు పూసుకుంటూ సందడి చేశారు. హోలీ వేడుకలతో గ్రామాల్లో సందడి నెలకొంది.