భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు,ఎంఎల్సీ తాత మధు సుడిగాలి ఎన్నికల పర్యటన. 

Written by telangana jyothi

Published on:

భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు,ఎంఎల్సీ తాత మధు సుడిగాలి ఎన్నికల పర్యటన. 

  • గులాబీ మయమైన వెంకటాపురం : గులాబీ జెండాలతో భారీ బైక్ ర్యాలీ.  

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విస్తృతంగా చేపట్టారు. మండలంలోని 18 గ్రామపంచాయతీలలో సుమారు 14 పైగా గ్రామపంచాయతీలను ఆయా గ్రామాలను కార్నర్ సభలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సరిహద్దులోని ఎదిర గ్రామం నుండి ఎన్నికల ప్రచార కాన్వాయ్ రధాలు కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వెంకటాపురం మండలం నుండి వేలాది ద్విచక్ర వాహనాలు గులాబీ జెండాలతో జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు, చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 35 కిలోమీటర్ల పైగా ర్యాలీ కొనసాగింది. వేలాది మోటార్ సైకిల్ ల ర్యాలీతో భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు ఎన్నికల ప్రచారం నాయకులకు బృందాలకు ప్రచార బృందానికి ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు సైతం మంగళవారం మానుకొని, రైతులు, కూలీలు ఓటర్లు ,పెద్ద సంఖ్యలో భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు కు ఘన స్వాగతం పలికారు. సీనియర్ టిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచార కోకన్వీనర్ గూడవర్తి నరసింహమూర్తి మండలంలో నాయకులను కార్యకర్తలను పార్టీ ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు రెండు రోజులు ముందుగానే ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ముందస్తు ప్రణాళికలతో యాక్షన్ ప్లాన్ తో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయడంతో ఎన్నికల ప్రచారంలో వందలు వేల సంఖ్యలో గులాబీ కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ సొంత బైకులు తీసుకొని ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు తో తాము ఆనందంగా జీవిస్తున్నామని, ప్రతిపక్షాలు చేసే మాయమాటలు నమ్మమని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని ఈ సందర్భంగా సమావేశంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, కారు గుర్తుకే మన ఓటు డాక్టర్ గారిని గెలిపించుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామంటూ నినాదాలు చేశారు. కార్నర్ మీటింగ్లలో అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు, శాసన మండల సభ్యులు తాత మధు మాట్లాడుతూ ప్రభుత్వం అమలుపరిచే సంక్షేమ పథకాలు, కారు గుర్తు ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను క్లుప్తంగా ప్రసంగించారు. మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, వెంకటాపురం మండల పరిషత్ అధ్యక్షులు చెరుకూరు సతీష్ కుమార్ వెంకటాపురం, వాజేడు మండలాల ఎన్నికల కన్వీనర్ బోదె బోఇన బుచ్చయ్య, వాజేడు మండల అధ్యక్షు రామకృష్ణారెడ్డి, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు అనేకమంది ఎన్నికల ప్రచార రథంపై ఆశీనులై కార్నర్ సమావేశాలలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీలతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు ఎప్పటి కప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాలు రాకపోకలను కొనసాగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ సైతం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏదిర, సురవీడు విజయపురి కాలనీ, ఆలుబాక , బోదాపురం, రామచంద్రపురం, వీరభద్రారం, పాత్ర పురం, ఉప్పెడు, ఇప్పల గూడెం చొక్కాల మండల కేంద్రం వెంకటాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం హోరెత్తించారు. ప్రచార కార్యక్రమాల్లో శాసన మండల సభ్యులు తాతా మధుసూదన్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, గతంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేసి మోసపోయారని,ఒక్క అవకాశం ఇచ్చి అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా తాత మధు పిలుపునిచ్చారు. అనంతరం వెంకటాపురం ప్రధాన మార్కెట్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లలో ప్రచార రథం పై నుండి ఎమ్మెల్సీ తాతా మధు, అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు సుదీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం పార్టీ సీనియర్ నేత వెంకటాపురం వాజేడు మండల ఎన్నికల ప్రచార కో కన్వీనర్ గుడవర్తి నర్సింహ మూర్తి తన స్వగృహం వద్ద నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్సీ తాత మధు పార్టీ అభ్యర్థి డాక్టర్ వెంకటరావు కొబ్బరికాయలు కొట్టి,పార్టీ జెండా ఎగురవేసీ ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తాత మధు డాక్టర్ తెల్లం వెంకటరావు మండల పరిషత్ అధ్యక్షులు సతీష్ కుమార్ కన్వీనర్ గుడపర్తి నరసింహమూర్తి, గంప రాంబాబు మానే రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే పోదాం వీరయ్య ఏ చేశారని,, కమిషన్ల దండుకోవటంతో పాటు దళిత బంధు పేర్లతో లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు వసూలు చేసి అమాయక దళిత కుటుంబాలను మోసం చేసి ఎన్నికలలో దళితుల డబ్బులను ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. స్వయంగా దళిత మహిళ తన ఆవేదనతో విడుదల చేసిన వీడియో ఏ సాక్ష్యం అన్నారు. ప్రాజెక్టు పై కోర్టుకు వెళ్లి కాంట్రాక్టర్ వద్ద కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్ ను బొంద పెట్టాలని, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే కారు గుర్తుకు ఓటు వేసి ప్రజా వైద్యుడు డాక్టర్ తెల్లం వెంకటరావుని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో వెంకటాపురం మండలంలో వందలు, వేల సంఖ్యలో వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ లో పార్టీలో చేరగా వారందరికీ గులాబీ కండవాలు కప్పి పార్టీలోకి నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మానే రామకృష్ణ,గుడవర్తి నరసింహమూర్తి, బోదె బొఇన బుచ్చయ్య , గూడపాటి శ్రీ నివాసరావు , గంప రాంబాబు,చింతల శ్రీ ను ,ఎస్కె ముస్తఫా , సతీష్ , వాజేడు జడ్పిటిసి తల్లాడి పుష్పలత, వెంకటాపురం, వాజేడు మండల పరిషత్ అధ్యక్షులు చెరుకూరు సతీష్ కుమార్ శ్యామల శారద కృష్ణారెడ్డి, ఇంకా కనేకమంది నాయకులు కార్యకర్తలు సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంగళవారం మండలంలో గులాబి ప్రచారం హోరెత్తడంతో టిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్తేజం కలిగింది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now