భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరావుకు అడుగడుగునా నీరాజనాలు

Written by telangana jyothi

Published on:

భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరావుకు అడుగడుగునా నీరాజనాలు. 

  • గులాబీ మయమైన వాజేడు మండలం. 
  • వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది బిఆర్ఎస్ లో చేరిక. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం లోని ములుగు జిల్లా వాజేడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు శనివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని చెరుకూరు గ్రామం నుండి చత్తీస్గడ్ సరిహద్దులోని టేకులగూడెం వరకు సుమారు 10 గ్రామపంచాయతీల గ్రామాలను కవర్ చేస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక వందల,వేల మంది గులాబీ సైన్యం తమ సొంత వాహనాల్లో తమ ప్రియతమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో భద్రాచలం నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ టికెట్ కేటాయించిన డాక్టర్ తెల్లం వెంకటరావు కారు గుర్తుకు ఓటు వేసి, గెలిపించాలని ఈ సందర్భంగా స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబంలో అందుతున్నాయని, ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు ప్రచారం చేసే ప్రతి పక్ష పార్టీలను,గ్రామాల్లోకి రాకుండా తిప్పి కొట్టి , కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రాచలం ఎమ్మెల్యేగా డాక్ట ర్ తెల్లం ను గెలిపించుకొని కానుకగా సమర్పించుకుందామని జై బిఆర్ఎస్ జై, జై బీఆర్ఎస్ అంటూ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆదివాసీలు నినాదాలు చేశారు. ముఖ్యంగా ఆదివాసీలు మహిళలు మంగళ హారతులతో స్వాగత సన్నహాలతో ప్రచార బ్రుందాలకు ఘన స్వాగతం పలికారు. మారు గిరిజన గ్రామాల్లో సైతం డాక్టర్ తెల్లం వెంకటరావు పార్టీ నేతలతో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వాజేడు మండలంలోని సుమారు 10 పంచాయతీలకు పైగా గులాబీ మయ మై వందలు , వేలమంది గ్రామాల ఆదివాసీలు ప్రజలు, రైతులు శనివారం వ్యవసాయ పనులు మానుకొని తమ ప్రియతమ నాయకుడు డాక్టర్ తెల్లం వెంకటరావు ఎన్నికల ప్రచార కాన్వాయ్ కు ఘణ స్వాగతం పలికి తాము ఎల్లవేళలా తమ వెంట ఉంటామని కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటామని, ఈ సందర్భంగా జై బీఆర్ఎస్, అంటూ కారు గుర్తుకే ఓటు వేస్తామని ఏకవాక్య తీర్మానంతో జేజేలు కొట్టారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వెంకటాపురం, వాజేడు మండలాలు ఇన్చార్జి ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బి. బుచ్చయ్య మండల పార్టీ అధ్యక్షులు పి. కృష్ణారెడ్డి పార్టీ నాయకులు , ప్రజాప్రతినిధులు, అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శనివారం సాయంత్రం పొద్దుపోయే వరకు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, సిఆర్పిఎఫ్ బ్రుందాలు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన వందల సంఖ్యలో గులాబీ కండువాలతో పార్టీలో చేరి, డాక్టర్ తెల్లం వెంకటరావుకు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వాజేడు మండలంలో బిఆర్ఎస్ పార్టీకి నూతన ఉత్తేజంతో పార్టీ ప్రచార కార్యక్రమం ఊపందుకుంది.

Tj news

1 thought on “భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరావుకు అడుగడుగునా నీరాజనాలు”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now