భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే వీరయ్య ఎన్నికల ప్రచారం. 

భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే వీరయ్య ఎన్నికల ప్రచారం. 

-భారీగా బైక్ ర్యాలీ 40 కిలోమీటర్ల పైగా బైక్ ర్యాలీతో స్వాగతం. 

– ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత బాల సాని లక్ష్మీనారాయణ. 

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే విజయాన్ని కాంక్షిస్తూ, సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సరిహద్దు గ్రామమైన ఎదిర గ్రామాల నుండి వెంకటాపురం వరకు భారీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో బైక్ ర్యాలీతో పార్టీ జెండాలను మోటార్ సైకిల్ కు కట్టుకొని జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మన ఓటు వేసి గెలిపించుకుందాం అంటూ నినాదాలు చేశారు. వెంకటాపురం నుండి ఎదిర వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. వేలాదిమంది పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు భద్రాచలం ఎమ్మెల్యేకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. వెంకటాపురం వాస్తవ్యులు అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , ఈ ప్రాంతంలో అబివ్రుద్ది పేరు ప్రతిష్టలు కలిగి ఉండటంతో పాటు కోట్లాది రూపాయల తో అభివృద్ధి పథకాలు మంజూరు చేసి, ఈ ప్రాంతాన్ని శక్తి వంచన లేకుండా అభివృద్ధికి కృషి చేసిన పేరు ప్రతిష్టలు కలిగి ఉండటంతో, ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వెల్లి విరిసింది. జై బాలసాని జై జై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్దపెటున నినాదాలు చేశారు. ఆయన అభిమానులు వేలాదిగా తరలివచ్చి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నిరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార రదంపై ఆశీనులైన భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య తో పాటు మాజీ శాసన మండలి సభ్యులు బి. లక్ష్మీనారాయణ వెంకటాపురం జడ్పిటిసి పాయం రమణలు అభివాదం చేస్తూ రోడ్ షోలో కార్నర్ మీటింగ్ లలో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు జరపకుండా ప్రజలను మోసం చేస్తున్నదని, ఎల్లవేళలా అందుబాటులో ఉండే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరయ్య ను గెలిపించుకొవాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని, మన భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య మనమే గెలిపించుకొని క్యాబినెట్ మంత్రిగా, మన ప్రాంతానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసి అనేక అభివృద్ధి పనులు చేయించుకొని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉందని కార్యకర్తలు, పార్టీ అభిమానుల హర్షధ్వనా ల మధ్య ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి అనేకమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో వారందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు . సూరవీడు, బోధపురం, ఆలుపాక, ముర్రవానిగూడెం, రామచంద్ర పురం, వీరభద్రవరం, పాతరాపురం, వీరాపురం చొక్కాల, మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణంలో ప్రచార ర్యాలీ రోడ్ షోలు భారీ ఎత్తున నిర్వహించారు. వెంకటాపురం పట్టణంలో జరిగిన రోడ్డు షోలో, కార్నర్ మీటింగ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరయ్యలు బిఆర్ఎస్ మోసపూరిత విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ పార్టీ నేతలు వారికి స్వాగతం పలికారు. బెస్తగుడెం , కమ్మరిగూడెం, మరికాల గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రచార కాన్వాయ్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అనేకమంది వారికి స్వాగతం పలుకుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ హర్షద్వా నాలతో నినాదాలతో అటవి గ్రామం లో మిన్నంటాయి. బాలసాని ఈ ప్రాంతంలో పేరు ప్రతిష్టలు కలగడం తో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మార్క్ ను ఎన్నికల ప్రచారంలో నూరు శాతం ఆయన అభిమానులు పాల్గొని, ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సైదు హుస్సేన్, పార్టీ నేతలు చిడెంమోహన్ రావు, మన్యం సునీల్, జడ్పిటిసి పాయం రమణ, ఎంపీటీసీలు రవి, సీతాదేవి, చిడెం శివ , పార్టీ సర్పంచులు, పార్టీ నేతలు అనేకమంది నాయకులు, వాజేడు మండల కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎటువంటి గొడవలు జరగకుండా వెంకటాపురం పోలీస్ ఎస్ఐ అశోక్ శశ బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment