బోడి చెరువు వద్ద మిస్టరీ గా వరహాల మృతదేహాలు. 

Written by telangana jyothi

Published on:

బోడి చెరువు వద్ద మిస్టరీ గా వరహాల మృతదేహాలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న బోడి చెరువు శికం వద్ద రెండు వరహాలను కట్ చేసిన ముక్కలు మిస్టరీగా పడి ఉన్నాయి. అయితే అవి పెంపుడు వరాహాల లేక అడవి వరహాల అనేది  తెలియ రాలేదు. సేకరించిన వివరాల ప్రకారం… ఇటివల కాలంలో అటవి గ్రామాల్లో విద్యుత్ తీగల తో అడవి జంతువుల వేట కొనసాగుతున్నట్లు చర్చించుకుంటున్నారు. అడవి మాంసం రుచే వేరని కిలో 700, 800 వందలు అయినా మాంసం ప్రియులు రహస్యంగా కొనుగోలు చేసి లొట్టలు వేసుకుంటూ రుచిని ఆస్వాదిస్తున్నారు. కాగా రెండు వరహాల కట్ చేసిన 8 కాళ్ళు తో వరహాల అవయవాలు ఆదివారం ఉదయం బోడి చెరువు శిఖం వద్ద దర్శనమిచ్చాయి.  ఇదిలా ఉండగా ఒక మాంసం వ్యాపారి మిగిలి పోయిన మటన్ ను తన ఇంట్లో డీప్ ఫ్రిజ్లో ఉంచి, ఆదివారం రోజు డి. కంపోజ్ అయిన మటన్ ను తాజాగా కోసిన మేకపోతు మాంసం లో కలిపి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని సమాచారం మేరకు వెంకటాపురం మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్, సిబ్బంది అధికారుల ఆదేశంపై ఆ ఇంట్లో తనిఖీలు చేయగా, డీప్ ఫ్రిజ్లో ఉంచిన మటన్ పట్టుబడింది. కాగా మటన్ను కిలో 800 రూపాయలు చొప్పున విక్రయించే వ్యాపారులు, మిగిలిపోయిన మటన్ ను డీప్ ఫ్రిజ్ల లో నిలువ ఉంచి విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన 24 గంటల్లోనే వరహాల మృతదేహాలు ఊరు పక్కనే ఉన్న, బోడి చెరువు శిఖం లో దర్శనమించడంతో, ఇదే విషయంపై వెంకటాపురం పట్టణంలో చర్చలు కొనసాగుతున్నాయి. అవి ఊర పెంపుడు వరహాలా , లేక అడవి వన్య ప్రాణి వరహాలా అనేది ప్రశ్నార్ద కంగా మారింది. ప్రజల ఫిర్యాదు మేరకు వెంకటాపురం మేజర్ పంచాయతీ సిబ్బంది వరహాల మృతదేహాలను చెరువు వద్దనే గుంత తీసి ఖననం చేశారు. వరహాల మృతదేహాల విషయంపై అటవీశాఖ, పశుసంవర్దక శాఖ అధికారులు కు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సుమారు 150 కిలోలకు పైగా బరువు ఉన్న వరహాల కట్ చేసిన  ముక్కలు మురిగిపోయి దుర్గంధం వేద చల్లుతున్నాయి. ప్రజల ప్రాణాలతో దొంగ వ్యాపారులు చెలగాటం ఆడుతున్నా రని  వ్యాపారం చేసే స్థావరాలపై అధికారులు దాడులు నిర్వహించాలని కోరారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి వుంది.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now