బెస్తగూడెంలోని 65 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక

Written by telangana jyothi

Published on:

బెస్తగూడెంలోని 65 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా భద్రాచలం నియోజకవర్గం లోని వెంకటాపురం మండలం బెస్త గూడెం గ్రామం నుండి వివిధ పార్టీ ల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్ నాయకులు వాజేడు, వెంకటాపురం మండలాల కో కన్వీనర్ గుడవర్తి నరసింహమూర్తి , బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు ఆధ్వర్యంలో వారికి పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సర్వే సంస్థలన్నీ కూడా ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయమని చెబుతున్నాయన్నారు. దానికి తోడు రాష్ట్రంలో చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేసి భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ ప్రాంతం అభివృద్ధికి పాత్రులు కావడంలో మనమంతా కూడా సైనికులు గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఇంతకుముందు భద్రాచలం నియోజకవర్గం వివిధ పార్టీల చేతిలో ఉండడం వలన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి భద్రాచలం నియోజకవర్గంలో డాక్టర్ తెల్లం వెంకటరావుని గెలిపించాలని కోరారు. ఈరోజు బి ఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు మేము మండల పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటూ ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేల్పూరి లక్ష్మీనారాయణ , బిఆర్ఎ అధికార ప్రతినిధి డర్ర దామోదర్, ప్రధాన కార్యదర్శి పిల్లరిశెట్టి మురళి,సర్పంచ్ ల సంఘ అధ్యక్షురాలు పూనెం శ్రీదేవి, సర్పంచ్ చిడెం లాలిబాబు, బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు పెనుమత్స మాధురి, సీనియర్ నాయకులు ముడుంబా శీనువాస్, శాంతమూర్తి యాదవ్, బుల్లె శంకర్రావు, ఉద్యమ నాయకులు నాగేశ్వరరావు, బెగ సాంబశివరావు, చింతల శ్రీను, రా మెల్ల మోహన్ రావు, బట్ట ఏడుకొండలు, గుండారపు పోతురాజు, రామటంకి జానకిరావు, గుండారపు మల్లికార్జునరావు, మునిగల రవి, తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “బెస్తగూడెంలోని 65 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now