బీఆర్ఎస్ కాటారం సబ్ డివిజన్ ఎస్టి సెల్ అధ్యక్షులుగా తైనేని సతీష్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి కాటారం సబ్ డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షులుగా తైనేని సతీష్ ను నియమించినట్లు బి.ఆర్.ఎస్ పార్టీ మంథని అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పుట్ట మధుకర్ తెలిపారు. కాటారం మండలం ఎస్టీ సెల్ అధ్యక్షులుగా సుంకరి మల్లేష్, ఉపాధ్యక్షులుగా దయ్యం వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆంగోతు బన్సీలాలను, మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులుగా తోట రామచంద్రం లను నియమించినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట జనార్దన్, నాయకులు పంతకాని సడవలి, బొడ్డు రాజబాబు తదితరులు పాల్గొన్నారు.