బిఎస్పి అభ్యర్థి గా జంపన్న నామినేషన్ దాఖలు
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు అన్నం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూక్య జంపన్న సైకిల్ తొక్కుకుంటూ వచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్ కు అందజేశారు. అనంతరం జంపన్న మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలు కాదు యువతర రాజకీయాలు కావాలి అని అన్నారు.మార్పు కోసం యువత కదిలి రావాలనీ కోరుతూ ఆర్ఎస్పి సార్ త్యాగం గురించి చెప్పుతూ మీ భవిష్యత్తు బాగుండాలంటే ఏనుగు గుర్తుకు ఓటేయాలను కోరారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి నాయకులు నరేష్ కుమార్ వీరబోయిన రాజేందర్ ముఖేష్ ముఖేష్ రాజు రమేష్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.