బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ముమ్మరం. 

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ముమ్మరం. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పంచాయతీలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేగం చేశారు. అందులో భాగంగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు విజయాన్ని కాంక్షిస్తూ పంచాయతీలు వారిగా ప్రచార కమిటీలు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను కలుసుకొని కారు గుర్తుకు ఓటు వేసి మన ప్రాంత అభివృద్ధికి డాక్టర్ వెంకట్రావుకు అవకాశం కల్పించాలని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రతి ఓటర్లకు అందజేసి ప్రచార కమిటీలు కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార కో కన్వీనర్ గుడవర్తి నరసింహమూర్తి ,సీనియర్ నేత ఎస్డి ముస్తఫా, పంచాయతీ సర్పంచులు, పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ప్రచార కమిటీల పర్యవేక్షణలో ముందస్తు ప్రణాళికతో ఇంటింటి ప్రచారం కార్యక్ర మంలో, ప్రతిపక్ష పార్టీల కంటే కారు గుర్తు స్పీడ్ తో దూసుకు పోతున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బిజేపి పార్టీల నుండి అనేకమంది బిఆర్ఎస్ పార్టీలో చేరుతూ, కేసీఆర్ సంక్షేమ పథకాలు పట్ల ఆదరణ చూపిస్తున్నా మని, ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మే పరిస్థితి లేదని అంటూ జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ కారు గుర్తుకే ఓటేద్దాం డాక్టర్ ని గెలిపించుకుందాం అంటూ ఇంటింటి ప్రచార బృందాలకు ఘన స్వాగతం పలుకుతు న్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా గులాబి మయం తో నేతల ప్రచార సరళి, ఎన్నికల ప్రచారం కారు గుర్తు తో వేడెక్కిస్తున్నది. మండలంలోని బిఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న బోధపురం, ఆలు బాక ఇతర పంచాయతీలలో మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, సీనియర్ నేత ముస్తఫా ఆలుబాక పాలు సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, బోదాపురం సర్పంచ్ సోడి రాధా, గ్రామ కమిటీలు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. వ్యవసాయ పనులు, మిర్చి తోటలు కారణంగా రైతులు వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లి సాయంత్రం పొద్దుపోయే సమయానికి ఇళ్లకు రావటంతో ప్రతి ఒక్క ఓటరును కలుసుకు నేందుకు ప్రచార కమిటీలు ఇంటింటి ప్రచారం బ్రుందాలతో , బోధపురం, ఆలుబాక పంచాయతీ గ్రామానికీ చెందిన కొండ గొర్ల శ్రీనివాస్ అనే రైతు టిఆర్ఎస్ పార్టీలో చేరటంతో, భోదాపురం సర్పంచ్ సోడి రాధా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆలుబాక సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, ఉప సర్పంచ్ కె. చందర్రావు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకర చంటి, నల్లూరి సుధాకర్, ఆర్ తిరుమల్ కుమార్, పి. రాజు, .బాబ్జి నాయకులు కార్యకర్తలు పెద్ద్ సంఖ్యలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment