బదిలీపై వెళ్తున్న అధ్యాపకులకు అభినందన సభ

Written by telangana jyothi

Published on:

బదిలీపై వెళ్తున్న అధ్యాపకులకు అభినందన సభ

వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత పుష్కరకాలంగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న అధ్యాపకులకు ఘణంగా అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా  చెరకు భూమక్క, భూక్య నాగేశ్వరరావు, గంజి రమేష్, గంటా కృష్ణ, పొరళ్ల మారేశ్వరరావు, లను ఘనంగా సన్మానించి అభినందించి వారి కృషిని కొనియాడారు. కళాశాల ప్రధానాచార్యాలు, కె. విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపన్యాసకులు అమ్మిన శ్రీనివాసరాజు, గజ్జి శ్రీనయ్య, వి.అవంతి, డి.నరసింగరావు, బి. ఆదిలక్ష్మి, కె. రాజు, బి. రాజు, కె.రాంబాబు,సుమన్, సంధ్య, అనిత, స్వర్ణలత, కళాశాల విద్యార్థులు, పూర్వవిద్యార్ధులు , అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now