ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నుండి డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్యుల సూచనల మేరకు రోగులకు నిర్దేశిత రోజులలో సేవలు అందుతాయి. రోగులు తమ పేర్లను ముందుగా నమోదు చేసుకొని డయాలసిస్ రోగులు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆస్పత్రి సూపరిడెంట్ కోరారు. డయాలసిస్ సేవలో అందుబాటులోకి రావడంతో డయాలసిస్ రోగులు ఆనందం వ్యక్తం చేశారు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి/ఆరవెల్లి సంపత్ కుమార్.
1 thought on “ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి”