ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
కులమతాలకు అతీతంగా జరుపుకునే ప్రజాస్వామ్యపు పండగే ఓటింగ్.
– ఎస్ వి ఈ ఈ పి నోడల్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రేమలత.మంగళవారం
తెలంగాణ జ్యోతి, నవంబర్ 21, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థు లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ వి ఈ ఈ పి ప్రేమలత ప్రత్యేక ఓటర్ల చైతన్య ర్యాలీ” నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో ఓటు అనేది ఓటర్ కి గుర్తింపు అని, దాన్ని నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు అంటూ నినాదాలు చేస్తూ వారంతా డిగ్రీ కళాశాల నుండి వై జంక్షన్ కూడలి వరకు కళాకారు లతో ఓటు హక్కు వినియోగం పై చైతన్య గీతాలు ఆలపిస్తూ ర్యాలీ తీసి, మానవ హారం నిర్వహించి అవగాహన కల్పించారు. నూతనంగా ఓటు హక్కు పొందిన విద్యార్థినీ విద్యార్థులు మాట్లాడుతూ, తాము ఎలాంటి ప్రలోభాలకు లోనూ కాకుండా, నిజాయితీగా, నైతిక విలువలు పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని, తమ కుటుంబాలను, తమ చుట్టుప్రక్కల సమాజాన్ని అవగాహన కల్పించి వారు డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసేలా జాగృతం చేస్తామని తెలిపారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిన్న అధ్యక్షతన డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో, నూతనంగా ఓటరుగా నమోదు అయినటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ చిన్నా మాట్లాడుతూ యువత ఓటింగ్ సందర్భంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కుల మత జాతి బంధుప్రీతి వంటి ఆపేక్ష లేకుండా నిజాయితీతో వ్యవహరించి ఓటు వేయాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఘన్ సింగ్ మాట్లా డుతూ కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న ఓటర్లంతా కూడా యువతరం కాబట్టి, వారంతా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఓటును డబ్బుకు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేసేలా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా ఎన్నికల ఐకాన్ గా నియమితుడైన జిల్లాకు చెందిన పర్వతా రోహకుడు వివేక్ మాట్లాడుతూ యువత లక్ష్యాన్ని నిర్దేశించుకు న్నప్పుడు ఎట్టి పరిస్థితులలో వెనుకడుగు వేయరాదని ఎంత కష్టమైనా అనుకు న్నది సాధించేవరకు పట్టుదలతో శ్రమించాలని యువతకు సూచిం చారు. మన సమాజం ఎంత గొప్పగా ఉండాలని కలలుకం టామో, అంతే గొప్పగా మనం ఓటు వేసే పద్ధతి ఉండాలని అన్నారు. అనంతరం ప్రేమలత మాట్లాడుతూ ఎన్నికలు అనేవి కుల మతా లకు అతీతంగా జరుపుకునే ప్రజాస్వామ్యపు పండుగ అని, కావున కొత్తగా ఓటరుగా నమోదైన యువతీ యువకులంతా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కోరారు. ఓటరుగా ఓటు వేయడంతోనే భాధ్యత తీరి పోదని, బాధ్యతాయుతంగా ఓటు వేసి ప్రభుత్వాన్ని గెలిపించు కోవడమే కాకుండా, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఓటరుగా హక్కులను సాధించుకొనుటకు ప్రశ్నించే గొంతుగా కూడా మారాల ని సూచించారు. మనం వేసే ఓటు సమాజాభివృద్ధికి తొలిమెట్టు, కావున నోటు కోసం యాచించకుండా ఓటు వేసి శాసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ, సఖి లీగల్ ఆఫీసర్ కర్నే ప్రణయ్ ప్రసాద్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ సుదర్శన్, కేసు వర్కర్ చంటి, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.