ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

– పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క..

తెలంగాణ జ్యోతి, నవంబర్18, తాడ్వాయి : కాంగ్రెస్ పార్టీ అధినేత పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అన్నారు. శనివారం మండలంలోని, కామారం గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ పార్టీ లోకి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మైపతి సంతోష్ రచన రావు,కేసోజు సరిత, చెవుగాని మంగమ్మ , పాయం సుగుణ, చేవుగాని రాజమ్మ, కేసోజు సాంబయ్య,కాక దయాకర్ , గొంది వెంకన్న, కేసోజు బ్రహ్మచారి లకు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మైపతి సంతోష్ రచన రావు ని ములుగు ఎస్టీ సెల్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అరెం లచ్చుపటెల్, సర్పంచ్ ఇర్ప సునీల్ దొర , కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి , జిల్లా మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేబోయిన సృజన , మండల మహిళాలు ,మండల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment