పంట చేనులో ప్రచారం నిర్వహించిన ఎంపీటీసీ మమత

పంట చేనులో ప్రచారం నిర్వహించిన ఎంపీటీసీ మమత

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి :  తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది గడపగడపకు ప్రచారం ముమ్మరం చేస్తూ పల్లె జనాలలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలపై ఎంపీటీసి మమత వివరిస్తున్నారు. వివరిస్తూ రైతులు రైతు కూలీలు నిత్యం పంట పొలాల్లో పనులకు వెళ్తుండడంతో మిర్చి చేనుకు వెళ్లి అక్కడ ఉన్న రైతులకు, రైతు కూలీలకు అందించే రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా ఎకరాకు రైతుకు, కౌలు రైతుకు 15 వేలు అలాగే వ్యవసాయ కూలీలకు 12వేలు అందిస్తామని కాళేశ్వరం ఎంపిటిసి రేవెల్లి మమత నాగరాజు, వివరించారు సోమవారం కాళేశ్వరం గ్రామంలోని పూసుకుపల్లి పంట పొలాలకు వెళ్లి వారితో కలిసి సద్దన్నం తింటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ భరోసా కలిపించారు అధికారంలోకి రాగానే ప్రతి వరి పంటకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా అందిస్తుందని తెలియజేశారు. ఓ అమ్మ, ఓ తాత నీ ఓటు ఎటు అంటూ ఆప్యాయంగా పాలకరిస్తూ ఉండగా నా ఓటు చేతి గుర్తుకే కాంగ్రెస్ కె అంటూ ముసలవ్వలు చీరు నవ్వుతో తెలియజేశారు.  కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే వృద్దులకు 4000 పింఛన్ చేయూత అందిస్తామని తెలిపారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని తెలియజేశారు *మన ప్రియతమా నాయకులు మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో చైర్మన్ , మంథని ఎమ్మెల్యే దుద్ధిల్ల శ్రీధర్ బాబు హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మారుమూల ప్రాంతం అయినా మంథని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధికి నోచుకుందని మళ్లీ శ్రీధర్ బాబు కు ఓటు వేసి గెలిపించుకొని అభివృద్ధిని ఆకాంక్షించాలని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం లో 12 వార్డ్ సభ్యురాలు స్వరూప, రేవెల్లి శ్యామల, మానస, దాసరి శంకరమ్మ, పూజ, సారక్క, గడిచేర్ల రాజమణి, తునూరి రాజమణి, గంప రాధిక, సింధు, తునూరి రేణుక, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment