నేడు కోటగుళ్ళలో కార్తీక దీపోత్సవం
– పదివేల మట్టి ప్రమిదల ఏర్పాటు
– పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
గణపురం, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఆలయ ప్రాంగణంలో పదివేల మట్టి ప్రమిదలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఏడు కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా పదివేల దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు. దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోటగుళ్ల పరిరక్షణ కమిటీ విజ్ఞప్తి చేసింది.