నృత్యం చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందిస్తుంది
– నాట్యాచార్యులు ముడుంబ మధుబాబు
– ములుగులో కూచిపూడి డాన్స్ తరగతులు ప్రారంభం
ములుగు, తెలంగాణ జ్యోతి : నృత్యం చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించడంతో పాటు పెద్దలపట్ల గౌరవం, నడవడిక నేర్పు తోందని ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు గుడుంబా మధుబా బు అన్నారు.శనివారం ములుగులోని అరవింద ఉన్నత పాఠశాల లో 10మంది చిన్నారులకు కూచిపూడి నృత్యం, లలిత సంగీత తరగతులను నటరాజ స్వామి పూజా కార్యక్రమాల అనంతరం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ హన్మకొండలో 30 ఏళ్లుగా కూచిపూడి నృత్యాన్ని చిన్నారులకు బోధిస్తున్నానని, తమ వద్ద శిక్షణ కోసం వచ్చిన విద్యార్థుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఎంతో ఉన్నతి కనిపిస్తుందని పేర్కొన్నా రు. భారతీయ పూర్వ కళలు, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి న అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద పాఠశాలల హెడ్మాస్టర్ సతీష్ అక్కల, పోడిశెట్టి దిలీప్, దేవేందర్ గుప్తా, చిన్నా రుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.