నామినేషన్ వేసిన ములుగు బిజెపి అభ్యర్థి డా.అజ్మీరా ప్రహ్లాద్

నామినేషన్ వేసిన ములుగు బిజెపి అభ్యర్థి డా.అజ్మీరా ప్రహ్లాద్

తెలంగాణ జ్యోతి, నవంబర్ 9, ములుగు ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ములుగు అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అజ్మీర ప్రహ్లాద్ నామినేషన్ వేశారు. బిజెపి అభ్యర్థి ప్రహ్లాద్ స్వగ్రామం సారంగపల్లిలో తన తండ్రి మాజీ మంత్రి స్వర్గీయ చందులాల్ విగ్రహ ఆవిష్కరణ చేసి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ముందుగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాద్ తండ్రి చందులాల్ విగ్రహ ఆవిష్కరణ చేస్తూ ఒకసారిగా విగ్రహాన్ని చూస్తూ కన్నిటి పర్యాంతమయ్యారు. తండ్రి విగ్రహ ముందు బీఫామ్ పేట్టి తీసుకొని నామినేషన్ కు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, ములుగు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీర ప్రహ్లాద్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లాకి గిరిజన యూనివర్సిటీ ఇచ్చి సమ్మక్క సారలమ్మ నామకరణం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పాలించి తట్టెడు మట్టి పోయలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్కకు ఓటు వేయడం వల్ల ఐదు సంవత్సరాలు ములుగు జిల్లాను వెనక్కి నెట్టి వేయవలసి వచ్చిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. ములుగు జిల్లా లో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయి అంటే కేంద్రంలో ఇస్తున్న 14,15 ఫైనాన్స్ ద్వారా ములుగు గ్రామపంచాయతీలో అభివృద్ధి పథంలో ఉన్నాయని అన్నారు. స్వదేశీ దర్పణం పథకంలో భాగంగా హరిత హోటల్ లో కట్టించిన ఘనత కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అదికారంలో లేకున్నా భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక పథకాల రూపంలో ములుగు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులను కేటాయించారని గుర్తుచేశారు. ములుగు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పాలనలతో ప్రజలు నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధికి వైపు ఆలోచిస్తున్నారని, సంచడు కూరగాయలు పిరకడు బియ్యంతో అభివృద్ధి మొత్తం నేనే చేసినట్టు విధంగా ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాటలు మాట్లాడుతుంటే హాస్యపదంగా ఉందని అన్నారు. ఒకసారి బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన విధి విధానాల వల్ల ఈరోజు కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఒక్కసారే ఆలోచించండి ములుగు నియోజకవర్గ ప్రజలారా అజ్మీల చందులాల్ తనయుడు అజ్మీర ప్రహ్లాద్ విద్య వంతుడు, యువ నాయకుడు ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తున్నాడు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కి ఓటు వేసి బిజెపి అభ్యర్థి ప్రహ్లాద్ ని గెలిపించాలని అన్నారు. ఆయనతో బిజెపి జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నాయకులు ఉన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment