నాగజ్యోతి గెలుస్తేనే ములుగు సమగ్రాభివృద్ది

నాగజ్యోతి గెలుస్తేనే ములుగు సమగ్రాభివృద్ది

– రానున్న ఐదు సంవత్సరాలలో ప్రతి కుటుంబానికి దళిత బందు.

– రానున్న ప్రభుత్వం లో గిరిజనులకు గిరిజన బందు.

– సర్వేసంస్థలు సెఫాలజిస్టుల అంచనా 66 నుంచి 80 సీట్లు..

 – రానున్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం…

 – మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ది సంస్ధ చైర్మన్ వి ప్రకాష్ 

తెలంగాణ జ్యోతి, నవంబర్ 22, ములుగు ప్రతినిధి : ములుగు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేనాగజ్యోతి అత్యధిక మేజార్టీతో గెలిస్తేనే ములుగు నియోజక వర్గ సమగ్రాభివృద్ది సాద్యమని తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ది సంస్థ చైర్మన్ వి ప్రకాష్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ములుగు నియోజక వర్గ ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై వివరణ యిచ్చారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడు తూ తాను 1996 లో జయశంకర్ తో కలిసి మలి విడత తెలంగాణ ఉద్యమం కోసం కృషి చేశానని తన అడ్వకేట్ జీవితానికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ తో కలిసి టిఆర్ఎస్ పార్టీ అవిర్బావం కోసం కృషి చేశానని అన్నారు. ములుగు నియోజక వర్గం గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థితో ఓటమితో అధికార పార్టీ ఎమ్మెల్యే లేక అభివృద్దికి కుంటు పడిందని, అయినప్పటికి ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయాలకు అతీతంగా నియోజక వర్గంలో సంక్షేమ పథఖాలు ప్రవేశపెట్టడంలో వెనుకాడ లేదని సీఎం సహాయ నిధి, దళిత బందు, గృహ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు , కళ్యాణ లక్ష్మి ,ఎల్ఓసిలు నియోజక వర్గ ప్రజలను నిరంతరాయంగా అందాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 శాతం కంటె ఎక్కువ యువత బీఆర్ఎస్ పార్టీతోనే ఉందని, దేశంలో ఎక్కడ లేని విధంగ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని బిజేపీ ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన గుజరాజ్ రాష్ట్రంలో 7 కోట్ల మంది జనాభా ఉండగా కేవలం 1,60,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికి లక్షా అరవై వేలు ఉద్యోగాలు భర్తీ చేయగా వివిధ కారణాల మూలంగా 40 వేల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయ న్నారు. ప్రజలను మబ్య పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేస్తుందని అన్నారు. ఏ రాష్ర్టానికి అయినా పూర్తి జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమై ప్రభుత్వమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయన్న విషయాన్న ప్రతిపక్షాలు గుర్తు ఉంచుకోవాలని అన్నారు. దళిత బందు ఒక నిరంతర ప్రక్రియ అని రానున్న ఐదు సంవత్సరాలలో అర్హులైన ప్రతి లబ్దిదారునికి దళిత బందు పథకాన్ని వర్తించే విధంగా ముఖ్య మంత్రి కేసిఆర్ వ్యూహ రచన చేశారని అన్నారు. దళితలు ఆర్థికంగా పటిష్టమైతేనే అంటరానితనం దూరమై సామాజిక వివక్ష తొలిగి పోతుందని అది నమ్మిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.రానున్న బిఆర్ఎస్ ప్రభుత్వం లో గిరిజనుల కోసం గిరిజన బందు సీఎం కెసిఆర్ ప్రవేశపెట్ట నున్నారని అన్నారు. విశ్వ కర్మలకు త్వరలో ఒక ప్రత్యేకకార్పొరేషన్ ద్వారా ప్రత్యేక అభివృద్ది నిధులు ప్రభుత్వం కేటాయించనుంద న్నారు. కాంగ్రెస్ లో ఓడించేందుకు తెలంగాణలో ప్రజలు సిద్దంగా ఉన్నారని రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని వివిధ సర్వే సంస్థలు,సిఫాల జిస్టుల అంచనా ప్రకారం 66నుండి 80 సీట్లతో సీఎం కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారన్నారు. ములుగు నియోజక వర్గ సమగ్రాభివృద్ది బడే నాగజ్యోతితోనే సాద్యమని కావునా నియోజక వర్గంలోని ఓటరు ముఖ్యమంత్రి కేసిఆర్ బలపర్చిన బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి అమూల్యమైన ఓటు వేసి రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆజ్మీరా ధరమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment