ధర్మవరం వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగురు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి .రమేష్ ఆధ్వర్యంలో సోమవారం విస్తృతంగా వాహనాల తనిఖీలను నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావటంతో తదితర భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని, ధర్మవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై వచ్చే పోయే వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని ఈ సందర్భంగా రాబట్టారు. ఎలక్షన్ కోడ్, ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని, ఈ సందర్భంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పేరూరు సివిల్ పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు వాహనాల తనిఖీల కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పేరూరు ఎస్సై రమేష్ మీడియాలకు తెలిపారు.
1 thought on “ధర్మవరం వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు. ”