‘ దుద్దిళ్ల ‘ కు ప్రైవేట్ డాక్టర్ల మద్దతు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం, మహదేవపూర్, పలిమల, మలహార్ రావు ,మహా ముత్తారం మండలాల ప్రైవేట్ డాక్టర్లు కాంగ్రెస్ కు మద్దతు పలికారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికలల్లో మంథని నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు మా పూర్తీ మద్దతు ఉంటుందని కాటారం, మహదేవపూర్, పలిమల, మలహార్ రావు, మహా ముత్తారం మండలాల ఆర్ఎంపీ, పీఏంపీ డాక్టర్లు తెలిపారు. వారు మాట్లాడుతూ పల్లెల్లో అత్యవసర సేవలు అందిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని వెల్లడించారు. తమ సేవలని గుర్తించి తమకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వపరంగా తోడ్పాటు అందించి తమకి మేలు జరిగేలా చూడాలని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కు విన్నవించినట్లు తెలిపారు.