తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటా కల్పించాలి
జీవో 33 అమలుపై మంత్రికి తల్లిదండ్రుల వినతి
నారాయణపేట, జూలై 30, తెలంగాణ జ్యోతి : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి జీవో 33 అమలుపై తమ వినతిని వ్యక్తం చేశారు. వైద్య మరియు విద్యా ప్రవేశాలలో తెలంగాణకు చెందిన విద్యార్థులకు స్థానిక కోటా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో జీవో 33 అమలును కోరుతూ మంత్రికి మెమోరాండం కాపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో డి. సుధాకర్, మెడికల్ విజయ కుమార్, సాయిలు, మేస్త్రి విజయ్ కుమార్, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.