డబ్బు సంచులు కాదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యం…

డబ్బు సంచులు కాదు.. ప్రజా సంక్షేమమే లక్ష్యం…

– ములుగులో కాంగ్రెస్ ను బొంద పెడదాం

– రాబోయే మన ప్రభుత్వంలో 400 కే గ్యాస్ సిలిండర్

– పూరి గుడిసెలు, పెంకుటిల్లులను పక్కా ఇండ్లు గా మార్చినంకనే నేను ఇళ్లు కట్టుకుంటా

– బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి

తెలంగాణ జ్యోతి నవంబర్ 19, మంగపేట : తాను వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకునేందుకు రాలేదని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ములుగు నియోజకవర్గంలో ప్రతి పల్లె అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. ఆదివారం ములుగు జిల్లా మంగపేట మండలంలో తిమ్మంపేట, చేరుపల్లి, అబ్బాయి గూడెం, బాలన్న గూడెం, నీలాద్రి పేట,బోర్ నరసాపూర్, బిక్షంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా నాగజ్యోతికి ప్రజలు బతుకమ్మలతో, మంగళ హారతులతో ఆహ్వానం పలికి బ్రహ్మరథం పట్టారు. ములుగు ఎమ్మెల్యేగా మా జ్యోతక్క గెలవాలంటూ పుష్పాభిషేకం నిర్వహిస్తూ గ్రామాల్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ మన ములుగు నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంగా ఉన్న కాంగ్రెస్ ను బొందపెట్టి బిఆర్ఎస్ పార్టీ ని గెలిపించాలన్నారు. 60 ఏల్లలో కాంగ్రెస్ పాలనలో చాలా మోసపోయి అరిగోసలు పడ్డామని అన్నారు. మనం పడ్డ కష్టాలను చూసి చలించిన తెలంగాణ జాతిపిత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఫలితమే తెలంగాణ వచ్చిందన్నారు. ఆయన కష్టం తోనే మన కష్టాలు తీరుతున్నాయన్నారు. రాష్ట్రంలో మూడో సారి అధికారం చేపట్టేది బీఆర్ఎస్ పార్టీనే అని, ములుగు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే పక్కా ఇండ్లు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందన్నారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే మన నియోజకవర్గానికి 5000 ఇండ్లు సాంక్షన్ అయ్యాయని, అదనంగా 4000 ఇండ్లు మంజూరు చేయించి ప్రతి పూరిగుడిసె, పెంకుటిల్లును పక్కా ఇల్లుగా మారుస్తా అని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని 93 లక్షల తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఎల్ఐసి పాలసీ ద్వారా 5 లక్షల రూపాయల రైతు బీమా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించానున్నారని చెప్పారు. గిరిజనేతరులకు పోడు పట్టాలతో పాటు అసైన్డ్ భూము లపై రైతులకు పూర్తి హక్కులు కల్పించేందుకు మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు వెల్లడించారు. రాబోయే మన ప్రభుత్వంలో రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అర్హులైన పేద మహిళలకు ₹3,000 జీవన భృతి కల్పించనున్నట్లు చెప్పారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, పార్టీ సీనియర్ నేతలు పోమా నాయక్, మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ, కో ఆప్షన్ సభ్యులు వలియాబి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment