జోరుగా కొనసాగుతున్న కారు ప్రచారం.

జోరుగా కొనసాగుతున్న కారు ప్రచారం.

– జ్యోతక్కకు మద్దతు తెలుపుతున్న గ్రామాలు, పల్లెలు.

తెలంగాణ జ్యోతి, నవంబర్ 17, గోవిందరావుపేట : మండలంలోని ఫ్రూట్ ఫారం,సోమల గడ్డ, రంగాపూర్, సండ్ర గూడెం, పాపయిపల్లి, గాంధీనగర్ కోటగడ్డ,ఇప్పలగడ్డ, మదనపురం, టప్పమంచ, ప్రాజెక్టునగర్, మోట్లగూడెం, నేతాజీ నగర్ తండా, అమృతండా లలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రచారం నిర్వహిస్తుండ గా పల్లెలు, గ్రామాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శత్రువులుగా ఉంటాయి కానీ ములుగు నియోజక వర్గానికి వచ్చే సరికి ఒక్కటయినాయన్నారు. మన ఇంటి పార్టీ లోకల్ పార్టీ మీద కక్ష కట్టి పిచ్చి కూతలు కుస్తున్నారు. పులి ఒక అడుగు వెనుకకు వేసిందంటే దాని అర్ధం పది అడుగులు గుప్పించి ముందుకు నువ్వు కూడా కోసమే అన్నారు. ములుగు నియోజక వర్గ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఓపిక ఉండడానికి గల కారణం అదేనన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించిన, భయపట్టిచ్చిన భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నది జ్యోతక్క ఉందన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసిన మీ ఇంటిముందు వాళి పోతానని అన్నారు. కెసిఆర్ భీమా ఇంటింటికి ధీమా, పట్టాలు లేని వారికీ పూర్తి యాజమాన్య హక్కుల కల్పనకై కృషి చేస్తానన్నారు. కెసిఆర్ చెప్పిండు అంటే చేస్తాడని, ఆడపిల్లలు తల్లిదండ్రులకు గుండెల మీద భారం కాకూడదు అని కల్యాణ లక్ష్మి పెట్టిండన్నారు. మా పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ పార్టీ..ఆరు గ్యారంటీ లు అని పెట్టుకుందని, పక్క రాష్ట్రంలో అధికారంలో వుండి అక్కడ లేని వాటిని ఇక్కడ ప్రవేశ పెడుతాం అంటే నమ్ముతామా అని ప్రశ్నించారు. ములుగులో మన గ్రామాలు అభివృద్ధికి అడ్డుకట్టగా వున్నది ధనసరి అనసూయ అని అన్నారు. రాష్ట్రంలో గెలిచేది కెసిఆరే ఇక్కడ కూడా కారుకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. కొత్త మ్యానిఫెస్టోలో 400 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు 3 వేల రూ. జీవన భృతి, రైతుబంధు10వేల నుండి16వేల కు పెంపు, తెల్ల రేషన్ కార్డు వున్నా ప్రతి ఒక్కరికి 5లక్షల భీమా కెసిఆర్ ఇస్తా అని చెప్పిండు ఇస్తాడన్నారు. అందరు అలోచించి కారు గుర్తు మీద ఓటు వేసి నన్ను ఆశీర్వదించాల న్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ సాంబారి సమ్మారావు, జడ్పీటీసీ, మండల అధ్యక్షుడు, గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment