జర్నలిస్టులకు సీతక్క తనయుడి అన్నదానం
వెంకటాపూర్, నవంబర్ 27, తెలంగాణ జ్యోతి: తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ వెంకటాపూర్ జర్నలిస్టులు మండలంలోని పాలంపేట గ్రామంలో గత పది రోజులుగా శాంతియుత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క తనయుడు కాంగ్రెస్ యువజన నాయకుడు సూర్య వెంకటాపూర్ జర్నలిస్టులకి అన్నదానం చేశారు. అన్నదానం చేసిన సూర్యకి వెంకటాపూర్ జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మారం సుమన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కట్టెకోళ్ల వెంకటే ష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పాలంపేట గ్రామకమిటి అధ్యక్షుడు నాగరాజు, ఎన్ ఎస్ యూ ఐ మండల అధ్యక్షుడు పూసల పవన్ కుమార్, పాలంపేట ఉప సర్పంచ్ మార్క జయ శంకర్, పీ ఏ సి యస్ డైరెక్టర్ బండి రజినికర్ తో పాటు జర్నలిస్టు లు బేతి సతీష్, ఒద్దుల మురళి, మామిడిశెట్టి ధర్మ, ఎండి రఫీ, ఎనగందుల శంకర్, అలుగొండ రమేష్, కేతిరి భిక్షపతి, పోశాల చంద్రమౌళి, బిరెల్లి రమేష్, దండపెళ్లి సారంగం, మునిగాల రాజు, తీగల యుగేందర్ ఎనబోతుల కృష్ణ, గట్టు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.