గుడుంబా పట్టివేత కేసులు నమోదు.
వెంకటాపురం నూగురు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలం లో సారా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వాజేడు పోలీసులు తమ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబా తో పాటు విక్రయదారుల సైతం వాజేడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఎస్సై వివరాలు ప్రకారం … వాజేడు మండలంలోని చింతూరు గ్రామములో పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు కాగితాల దుర్గారెడ్డి, ములకల మోహనరావు, ములకల అర్జయ్య ల కిరాణం షాప్ లలో ప్రభుత్వం చే నిషేదించబడిన నాటు సారా అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ,అట్టి షాప్ లలో తనికీలు చేశారు. కాగితాల దుర్గారెడ్డి షాప్ లో 20 లీటర్లు, ములకల మోహన్ రావు షాప్ లో 10 లీటర్లు, ములకల అర్జయ్య షాప్ లో 10 లీటర్ల చొప్పున మొత్తం 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొన్నారు. వారి ముగ్గురి పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు వాజేడు పోలీసు స్టేషన్ పరిధి లో అందాజా 10 కేసు లు పెట్టడం జరిగింది. అట్టి కేసులలోని నిందితుల అందరిని వాజేడు తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది.అట్టి బైండ్ ఓవర్ కాబడిన వ్యక్తులు ఎవరైనా మళ్ళీ గుడుంబా తో పట్టుబడి నట్లైతే వారిని బాండ్ అమౌంట్ ను జప్తు చేయడం జరుగుతుంద ని .ఒకవేళ అట్టి మొత్తం కట్టని పక్షం లో వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆదేశం పై జైలుకి పంపటం జరుగు తుందని తెలిపారు. కావున ఎవరు కూడా ఇటువంటి నిషేధింధించిన, ఆరోగ్యానికి హానికరమైన వాటిని అమ్మడం కానీ ఉపయోగించడం కానీ చేయకుండా ఉండాలని ఎస్ఐ వెంకటేశ్శరరావు ప్రజల ను కోరారు.