గార్థబాల పాలకు భలే గిరాకీ : వీధి వీధినా విక్రయాలు. ఓకే
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో సంచార జాతులు వారు, గాడిదల పాల ను వీధి వీధినా, గ్రామ, గ్రామాన సంచరిస్తూ ఉదయం పూట ఇళ్ళ ముందే పాలు పిండి విక్రయి స్తున్నారు. దగ్గు, ఉబ్బసం, ఆయాసం ఇతర రోగాలకు గాడిద పాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని, మూడు పూటలు సేవిస్తే చాలు రోగాలు మటుమాయం అవుతాయని, గాడిదల పెంపకం దారులు చెబుతున్నారు. ఆయా రోగాలతో బాధపడేవారు వేల రూపాయలు ఖర్చులు పెట్టి దవాఖానాలు చుట్టూ తిరిగే బదులు, గాడిద పాలు సేవించి రోగాల బారి నుండి బయట పడవచ్చునని సంచార జాతు లు వారు చెబుతున్నారు. ఈ మేరకు గ్లాస్ పాలు 200 నుండి 300 రూపాయల వరకు కావలసిన వారికి ఇంటి ముందే గాడిదల నుండి పాలు పితికి విక్రయిస్తున్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన దేవస్థానం ఆవరణ లో సంచార గాడిదల పెంపకం దారులు గుడిసెలు వేసుకొని నివాసాలు వుంటూ కోడి కూతతో వేకువజామున తెల తెలవారకముందే, గాడిద పాలు బాబు, గాడిద లు పాలు బిగ్గరగా అరుస్తూ, వీధి, వీధిన గాడిదలతో సంచరిస్తున్నారు. ఈ మేరకు అవసరమైన వారు కార్మికులు, రైతులు ,ఉద్యోగులు ,పలువురు సైతం గాడిద పాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతుండటంతో, గాడిద ల పాలుకు గిరాకీ ఏర్పడింది. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు పాలిచ్చే గాడిదలను ఆటోలు లో ఎక్కించుకొని తెల,తెల,వారక ముందే పాలమ్ము కొని తిరిగి తమ తాత్కాలిక మఖాం వరకు తిరిగి వస్తున్నారు. తమ గాడిదల గుంపును వెంకటాపురం పట్టణంలో వదిలివేస్తూ, కొంతమంది పెంపకం కాపలాదారులు, వాటిని కనిపెట్టుకొని తిరిగి తమ మఖాం వద్దకు తోలుకుని వస్తున్నారు. కాగా గాడిదలను చూసి, గ్రామ సింహాలు తమదైన శైలిలో వెంట పడగా, ఎగిరి గంతేసి కాలు జాడిస్తుండడంతో గ్రామ సింహాలు స్సతం తోక ముడిచి పరుగులు తీస్తున్నా ఇ. గాడిద మాంసం కు కూడా కిలో 1,000 రూపాయలు పైగా గిరాకీ ఉండటంతో, విజయవాడ ప్రాంతంలో గాడిద మాసం విక్రయశాలలు ఉన్నట్లు పెంపకందారులు తెలుపుతున్నారు. అయితే ఒక్కొక్క గాడిద 30,000 వేల రూపాయలు పైగా ధర పలుకుతుందని చెబుతున్నారు. ఒకప్పుడు అడ్డ గాడిద అంటూ ప్రేమతో తిట్టి పోసే పెద్దలు ను స్సతం ఆశ్చర్యం పొందే విధంగా గార్దబాలు జనజీవనంలో, క్షీరాన్ని ఔషధంగా స్వీకరించే రోజులు వచ్చాయి. ఇందులో భాగంగా వెంకటాపురం మండల కేంద్రంలోని దేవస్థానం గ్రౌండ్ కు ఉదయాన్నే పలువురు చిన్న, చిన్న బాటిళ్లు పట్టుకొని గాడిదల పాలును కొనుగోలు చేసేందుకు క్యూలు కడుతున్నారు.
1 thought on “గార్థబాల పాలకు భలే గిరాకీ : వీధి వీధినా విక్రయాలు.”