కోడిపందాలు ఆడుతున్న వారి అరెస్టు.
- 8 మందిపై కేసులు నమోదు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి ముకునూర్ పాలెం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు బెట్టింగ్ పెట్టి కోడి పందాలు ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్.ఐ .ఆర్.అశోక్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. జామాయిల్ తోట సమీపంలో జరుగుతున్న కోడి పందేలపై రైడ్ నిర్వహించగా ఎనిమిది మంది వ్యక్తులు, రెండు కోడి పుంజులు, రెండు కోడి కత్తులు, 4 వేల రూ. బెట్టింగ్ డబ్బులతో పట్టుబడినట్లు ఎస్.ఐ .ఆర్.అశోక్ తెలిపారు. పంచనామా అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియా కు పేర్కొన్నారు.
1 thought on “కోడిపందాలు ఆడుతున్న వారి అరెస్టు.”