కోటగుళ్లలో సూపరిండెంట్ డాక్టర్ నవీన్ కుమార్ పూజలు
గణపురం, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం భూపాలపల్లి ప్రధాన ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగ ణంలోని గోశాల గోమాతలకు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.
1 thought on “కోటగుళ్లలో సూపరిండెంట్ డాక్టర్ నవీన్ కుమార్ పూజలు”