కొనసాగుతున్న జర్నలిస్టుల శాంతియుత దీక్ష
తెలంగాణ జ్యోతి, నవంబర్ 23, ములుగు ప్రతినిధి : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వక పోవడంతో ములుగు జిల్లా వెంకటాపూర్ జర్నలిస్టులు పాలంపేట లోని సర్వే నంబర్ 14 లోని ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేసు కొని చేపట్టిన దీక్ష నేటికీ కొనసాగుతోంది. గత పదిరోజులు జర్నలి స్టులు చేపట్టిన దీక్ష కి మండలం లోని ప్రజలు, వివిధ పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కాగా, గురువారం జర్నలిస్టులకుపాలంపేట గ్రామస్తులు పలువురు మద్దతుతెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గు చేటని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం కు మద్య వారధిగా ఉండే జర్నలిస్టుల ను చిన్న చూపు చూడటం బాధాకరం అని అన్నారు. చేసేది ఏమీలేక పాలంపేట లోని ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేసుకుని దీక్ష చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జర్నలిస్టుల కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బేతి సతీష్, ఒద్దుల మురళి, దండపెళ్లి సారంగం, పిల్లలమర్రి శివరాం, అశోక్, రఫీ, భిక్షపతి, శంకర్, కృష్ణ, రమేష్,సంపత్, రవిరాజా, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.