కాంగ్రెస్, బిజెపి ల నుండి బిఆర్ఎస్ లో చేరికలు

కాంగ్రెస్, బిజెపి ల నుండి బిఆర్ఎస్ లో చేరికలు

ములుగు, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి : ములుగు మండలం జీవింతరావు పల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ని గణేష్ లాల్ పల్లి కి చెందిన 100 మంది కాంగ్రెస్, బిజేపి పార్టీ లకు రాజీనామా చేసి ములుగు ఎన్నికల ఇంచార్జీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. అదేవిధంగా వెంకటాపూర్ మండలం కాంగ్రెస్ నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ మాడ్గుల రమేష్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ డైరెక్టర్లు ఊకంటి సాంబ శివరెడ్డి, మేకల రవి ఇంద్ర లు ఎమ్మెల్సీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలకు, సీఎం కేసీఆర్ అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగిందని తెలియజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డ అయినటువంటి బడే నాగజ్యోతిని ఆశీర్వదించి మన ముందుకు పంపారు. మీరంతా కలిసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment