కాంగ్రెస్ బందు పిలుపు సఫలం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గం మహా ముత్తారం మండలం మీనాజీపేట కిష్టాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా జరిగిన గొడవలకు నిరసనగా బుధవారం మంథని నియోజకవర్గం బంధుకు కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంధు పిలుపుమేరకు కాటారం మండలం లో వ్యాపార వాణిజ్య వర్తక దుకాణాల సముదాయాలు, విద్యాసంస్థలు బందు పాటించాయి. అనంతరం గారె పల్లి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎన్నికలలో రౌడీయిజం, గుండాయిజంను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుందని వారు విమర్శించారు. మంథని ముత్తారం మండలం ఓడేడు గ్రామ సర్పంచి బక్కారావు, ఆయన భార్య పద్మ మీనాజీపేటలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తుండగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. దాడుల సంస్కృతిని ప్రజాస్వాదులు ఖండించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఆయన అనుచరులు గుండా గిరితో ప్రజాస్వామ్యంలో గెలవలేరని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. మంథని నియోజక వర్గాన్ని ప్రత్యేక సున్నిత ప్రాంతంగా గుర్తించాలని ఎన్నికల కమిషన్ ను కోరామని అన్నారు. పోలీసు బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేసి ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పరిస్థితులు నెలకొల్పాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ కార్యక్ర మంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, పిసిసి మహిళా కార్యదర్శి ఆంగోతు సుగుణ, డీసీసీ ఉపాధ్యక్షులు గద్దే సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రెడ్డి, డాక్టర్ ఎలుబాక సుజాత, ప్రచార కమిటీ కన్వీనర్ కుంభం రమేష్ రెడ్డి, కోకన్వీనర్ నాయిని శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఎంపిటిసి జాడి మహేశ్వరి, ఓబీసీ మండల అధ్యక్షుడు కొట్టే ప్రభాకర్, చీమల సత్యం,మైనారిటి సెల్ అధ్యక్షులు అమీర్ , అధికార ప్రతినిధి కొట్టే శ్రీహరి, మాచర్ల రాజేందర్, చీర్ల తిరుపతి రెడ్డి, పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.