కాంగ్రెస్ పార్టీ ప్రచార కోకన్వీనర్ గా మొగిలి రాజ్ కుమార్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: అసెంబ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో మంథని శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాటారం మండలం లోని రేగుల గూడెం, శంకరం పల్లి, గంగారం, ధర్మసాగర్, విలాసాగర్, చిదినేపల్లి, చింతకాని గ్రామాలకు ప్రచార కో కన్వీనర్ గా మొగిలి రాజ్ కుమార్ ను ఏఐసీసీ కార్యదర్శి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీను బాబు ఆదేశాల మేరకు నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ కుంభం రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మొగలి రాజకుమార్ మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డికి, ఎంపీపీ సమ్మయ్య, రమేష్ రెడ్డి, నాయిని శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మంథని నియోజకవర్గం లో శ్రీధర్ బాబు గెలుపునకు కృషి చేస్తానని రాజకుమార్ వెల్లడించారు…