కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

తెలంగాణ జ్యోతి, నవంబర్ 21, ఏటూరునాగారం : మండల కేంద్రంలోని 6, 7 వార్డుల నుండి దాసరి తిరుపతి, యువత నాయకత్వంలో బిఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి చేరికలు జరగగా జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీ నరసింహ రావు కండువాగప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారు కే.సీ.ఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమై కె.సి.ఆర్ సార్ కలలుగంటున్న బంగారు తెలంగాణ సహకారంలో మేము కూడా భాగస్వాములం కావాలనే దృడ సంకల్పంతో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరామన్నారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి నరసింహారావు మాట్లాడుతూ బడుగు,బలహీన,ఎస్సీ.ఎస్టీ, కులాలకు మతాల కతీతంగా కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ పంచాలని బలమైన సంకల్పం కలిగిన మహోన్నత నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ అని అన్నారు. కెసిఆర్ భరోసా ఎన్నికల మేనిఫెస్టో భూమిలేని, తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద ప్రజలందరికీ ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. యువత అంత మేనిఫెస్టోను చదివి మీ చుట్టుపక్కల వారందరికీ వివరించి చెప్పి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడేనాగజ్యోతి కారు గుర్తుకు అధిక ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు ఎండి.వలియా సలీం, ఎంపీపీ.అంతటి. విజయ నాగరాజు, పి.ఎ.సి.ఎస్ చైర్మన్ కూనూర్ అశోక్ గౌడ్, సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సప్పిడి రామ నరసయ్య, యువ నాయకుడు కాకుల మర్రిప్రదీప్ రావు,2వ ఎంపీటీసీ కుమ్మరి స్వప్నచంద్రబాబు, మండల రైతు బంధు కోఆర్డినేటర్ దన్నపనేని.కిరణ్, జాడి భోజరావు, వావిలాల రాంబాబు, శివాలయం చైర్మన్ తాడూరి రఘు, కొండాయి చిన్ని, శ్రీనివాస్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment